డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం కూలిపోతోంది అని కామెంట్స్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు.
హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన జనగామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అరూరి రమేష్ మాట్లాడుతూ.. 2013లో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీ బలోపేతానికి…
తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా.. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొందరు ఐఏఎస్ అధికారులు, కాంగ్రెస్ నేతపై దాడులు చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి రాను సాహు, మరికొందరు బ్యూరోక్రాట్‌లు, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్‌కు సంబంధించిన ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.