నగరంలోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. పాలు ప్యాకెట్ తెస్తానని ఇంటినుంచి బయటకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి శవమైంది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నగరంలోని ఎల్బీనగర్ లోని చింతల్ కుంట- మధురానగర్ కాలనీ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. వారికి వర్షిత అనే 9 ఏళ్ల చిన్నారి ఉంది. నిన్న మంగళవారం ఇంట్లో నుండి పాల ప్యాకెట్ కోసం వెళ్లింది వర్షిత. అయితే.. వెళ్లిన కూతురు ఎంతసేపటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన…
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీ ఆర్ నగర్ లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను వనస్థలిపురం లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. తెలంగాణ లో ఎన్ని లక్షల సీసీ కెమెరాలు,షీటీమ్స్ ఎన్ని ఉన్నా కానీ మహిళలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కేవలం ప్రగల్భాలు పలికే అసమర్థత సీఎం వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న హత్యచార కేసులను…
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత పాదయాత్రలో.. 31 రోజుల్లో 383km పూర్తి చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి విజవంతం చేసినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందని…
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్‌లో ఓ బాలుడి తల కలకలం సృష్టించింది… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్ 1 దగ్గర ఓ శిశువు తల కుక్క నోట్లో పట్టుకుని తీసుకొచ్చింది. ఊహించని ఘటనతో స్థానికులు షాక్ తిన్నారు. సహర గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో శిశువు తలను పట్టుకొచ్చింది కుక్క.. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని కుక్కని తరిమేసి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..…
హైదరాబాద్: ఎల్బీ నగర్ ప్రేమోన్మాది దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడి నిందితుడు బస్వరాజ్ కి రిమాండ్ విధించింది కోర్టు. యువతి దాడి కేసులో భాగంగా ఇవాళ నిందితుడు బస్వరాజ్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు లో హాజరుపర్చారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులు చెప్పిన వివరాలు విన్న…రంగారెడ్డి జిల్లా కోర్టు…నిందితుడు బస్వరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఆమె శరీరంపై…
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన జరిగింది.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని.. తనతో కాకుండో మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుందంటూ ఓ యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడో యువకుడు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన ఓ యువతి.. అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్ అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది.. Read Also:…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. అయితే ఈ బదిలీల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత మరోసారి తన స్థానాన్ని వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కూకట్‌పల్లిని వీడేందుకు మమత విముఖత చూపారు. దీంతో ఆమెను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గానే కొనసాగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: రెండు రోజుల పాటు నీటి సరఫరా…
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతలకు దారితీసింది. దిల్‌షుఖ్ నగర్ నుంచి పార్టీ ర్యాలీని చెపట్టానలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. ఎల్బీనగర్‌లోని కూడలిలో ఉన్న శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్త కళ్యాణ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది.…