నగరంలోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. పాలు ప్యాకెట్ తెస్తానని ఇంటినుంచి బయటకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి శవమైంది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నగరంలోని ఎల్బీనగర్ లోని చింతల్ కుంట- మధురానగర్ కాలనీ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. వారికి వర్షిత అనే 9 ఏళ్ల చిన్నారి ఉంది. నిన్న మంగళవారం ఇంట్లో నుండి పాల ప్యాకెట్ కోసం వెళ్లింది వర్షిత. అయితే.. వెళ్లిన కూతురు ఎంతసేపటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాపకోసం వెతుకుతుండగా చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఓ బిల్డింగ్ వద్ద వర్షిత శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
read also: Armed Forces: భారత త్రివిధ దళాల్లో 1.35లక్షల ఖాళీలు.. వెల్లడించిన కేంద్రం
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పాలకోసం బయటకు వచ్చిన చిన్నారిని ఎవరో ఆటోలో తీసుకువచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. పాల కోసం వచ్చిన చిన్నారిని ఎవరైనా ఆటోలో తీసుకువచ్చి బిల్డింగ్ పై నుంచి ఎందుకు తోసేసారని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే మరోవైపు ఇది హత్యా ? లేదా ప్రమాదవశాత్తూ చిన్నారి కిందపడిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అసలు పాల ప్యాకెట్ తెస్తానని చెప్పి రూ.20 తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిన పాప ఆటోలో బిల్డింగ్ దగ్గరకు ఎలా, ఎవరు తీసుకు వచ్చారనే కోణంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.