హైదరాబాద్: ఎల్బీ నగర్ ప్రేమోన్మాది దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడి నిందితుడు బస్వరాజ్ కి రిమాండ్ విధించింది కోర్టు. యువతి దాడి కేసులో భాగంగా ఇవాళ నిందితుడు బస్వరాజ్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు లో హాజరుపర్చారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులు చెప్పిన వివరాలు విన్న…రంగారెడ్డి జిల్లా కోర్టు…నిందితుడు బస్వరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
కాగా.. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఆమె శరీరంపై 18 చోట్ల గాయలున్నట్లు గుర్తించిన వైద్యులు వాటిలో.. ఆరు ప్రదేశాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బాధితురాలు కోలుకునేందుకు శ్రమిస్తున్నామని.. 48 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని వైద్యులు చెబుతున్నారు.