Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు.. సహాయం చేసిన చేతులనే నరికి వేస్తున్న సంఘటనలు.. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చినందుకు చంపి పాతర వేశాడు.. తన పాడు బుద్ధులను బయట ప్రపంచానికి తెలియజేసినందుకు సహాయం చేసిన అడ్వకేట్ ని వేటాడి చంపేసిన తీరు ఇది. హైదరాబాదులోని చంపాపేట్‌లో జరిగిన దారుణ సంఘటన సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. పాతబస్తీ చంపాపేట్‌కు చెందిన ఎర్రబాబు ఇజ్రాయిల్.. ఇతను ఒక న్యాయవాది.. హైకోర్టుతో పాటు సిటీలోని…