ఎన్‌సీఈఆర్‌టీ మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు చేసింది. సిలబస్ మార్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాసంస్థలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు.
బార్బడోస్ గడ్డపై 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈరోజు భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని టీమిండియా సభ్యులు కలిశారు.
ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రముఖ వ్యాపార వేత్త మఖేష్ అంబానీ కలిశారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జులై 12 న ప్రారంభం కానున్నాయి.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు.
ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు.
జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి హేమంత్ సోరెన్ అధిరోహించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మరోసారి విడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో అడ్వాన్స్‌డ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ. విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ (ఓటీఎస్)ను ప్రవేశపెట్టబోతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామవి రేవంత్ కు చంద్రబాబు ప్రతిపాదన పంపారు. తెలుగురాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో పేర్కొన్నారు.
దేశంలో చెలామణి నుండి తొలగించబడిన రూ. 2000 (రూ. 2000 నోటు) పింక్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది. ఈ కరెన్సీ నోట్లు గత ఏడాది మే నెలలో చెలామణి నుంచి తొలగించినా.. ఇంకా ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న 100 శాతం నోట్లు తిరిగి రాలేదని తెలిపింది.