Electricity bill: ఇటీవల కరెంట్ బిల్లుల్లో తప్పులు దొర్లుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలా సాధారణ కుటుంబాలకు లక్షల్లో కరెంట్ బిల్లులు వచ్చిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కుటుంబానికి ఏకంగా రూ. 20 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి ఆ ఫ్యామిలీ షాక్ అయింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ 'తలాష్' విజయవంతమైనందని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో అరెస్టయిన సీరియల్ కిల్లర్ విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మధ్య వయస్కులైన మహిళలను ఒంటరిగా కనబడితే వారికి ప్రపోజ్ చేసేవాడు.
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. పొలార్డ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చాడు. వరల్డ్ క్లాస్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓవర్ లో అతను ఈ సిక్సర్లు బాదాడు.
మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఛైర్మన్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు.
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు పదేళ్ల విద్యార్థినిపై దారుణంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ పాఠశాల బాత్ రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
UP Cop: ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌కి చెందిన ఓ ఎస్ఐ లంచం కోరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆయన ఏం కోరాడంటే.. తనకు లంచంగా ‘‘5 కిలోల బంగాళాదుంపలు’’ కావాలని బాధితుడిని అడిగారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లంచానికి కోడ్ పదంగా ‘‘బంగాళాదుంపల్ని’’ ఉపయోగించాడు.