ఇంగ్లాండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. పొలార్డ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చాడు. వరల్డ్ క్లాస్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓవర్ లో అతను ఈ సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా.. సదరన్ బ్రేవ్ 2 వికెట్ల తేడాతో ట్రెంట్ రాకెట్స్‌ను ఓడించి థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఒకానొక సమయంలో సదరన్ బ్రేవ్ మొత్తం స్కోరు 78 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత పోలార్డ్‌కు టూఫాన్ పేరు వచ్చింది. ఓడిపోతుందనుకున్న గేమ్ ని గెలిపించాడు.
READ MORE: Luana Alonso: నెయ్‌మర్ నుంచి ప్రైవేట్ మెసేజ్ వచ్చింది.. బాంబ్ పేల్చిన ఒలింపిక్స్ బ్యూటీ!
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో జరిగిన హండ్రెడ్ లీగ్ 24వ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ – ట్రెంట్ రాకెట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ బాంటన్ అత్యధికంగా 30 పరుగుల తీశాడు. 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సదరన్ బ్రేవ్ 99 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. సదరన్ బ్రేవ్ తరఫున కీరన్ పొలార్డ్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. విజయానంతరం పొలార్డ్ మాట్లాడుతూ.. “ఈ పిచ్ బ్యాటింగ్ కు అంత సులువు కాదని తెలిపాడు. రషీద్ ఖాన్‌పై నేను మంచి షాట్లు కొట్టడం అదృష్టం. అతను ప్రపంచ స్థాయి బౌలర్. నేను నా సహజమైన ఆట ఆడాను.” అని పేర్కొన్నాడు.
6,6,6,6,6 💪💪 Kieron Pollard What a Hitting Against Rashid Khan 🔥 It's Just 5 Ball Over in Hundred League else Polly May Hit 6 Sixes in An Over Again 🔥#Pollard
pic.twitter.com/PvASobqcb3— Sagar Mhatre (@MhatreGang) August 10, 2024