అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది.
గత పది సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిమిషం కూడా వృథా చేయమన్నారు. ఎర్రుపాలెం మండలం జములాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాలతో భార్య హత్య చేసినట్లు గుర్తింపు. పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవవి. అస్సాంకు చెందిన రుక్సానా(35) భర్తతో కలిసి హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉండేవారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
ఇంతకి ఇది హైడ్రా నా హై డ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు యే ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు.
పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఓటరు లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణ కొరకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
కోవర్టు అనే అనుమానంతో నక్సలైట్లు తమ సహచరురాలిని హత్య చేశారు. మావోయిస్టులు మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చారు. రాధా అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మరణశిక్ష మావోయిస్టు పార్టీ విధించింది.
కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మాట్లాడుతూ.. "పబ్బులు తిరిగే లోపర్ నా కొడుకు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు.
ప్రస్తుతం జుట్టు రాలడం కామన్ గా మారింది. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు ఎన్నో రకాల శాంపులు, నూనెలు వాడుతుంటాం.