Cyber crime: అలర్ట్.. పాడైన ఫోన్లు అమ్ముతున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే!
- పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠా
- ముఠాను పట్టుకున్న పోలీసులు
- సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైమ్ ల కోసం పాత ఫోన్లను వాడకం
- . 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైమ్ ల కోసం పాత ఫోన్లను వాడుతున్నారని పోలీసులు గుర్తించారు. వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి.. లేదా ప్లాస్టిక్ సామాన్ ఇచ్చి ఫోన్లు కొంటున్నారు. 3 గోనే సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ కి చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికర్ ని గోదావరి ఖని పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా పట్టుకున్నారు. ఈ ముఠా తెలంగాణ జిల్లాల్లో గ్రామ గ్రామాన మొబైల్ ఫోన్లు కొని బీహార్ మీదుగా… జామ్ తారా, దేవ్ ఘర్, జార్ఖండ్ తరలిస్తోంది. సైబర్ నేరగాళ్లకు అమ్మేముందు.. మొబైల్ ఫోన్స్ లో సాప్ట్ వేర్ మార్చడం, ఇతర విడిభాగాలు మార్చి.. ఫోన్ పనిచేసేలా చేస్తున్నారు. అనంతరం అందులో ఉన్న డేటాను సైబర్ నేరగాళ్ల చేతికి అందజేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు మీ పాత ఫోన్లను అమ్మవద్ధని పోలీసుల సూచిస్తున్నారు.
READ MORE: Hezbollah-Israel war: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్ల ప్రయోగం.. ఒకరి మృతి.. ఇళ్లు ధ్వంసం
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
కాగా.. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. దీంతో పోలీసులు ఇతర నేరాలను ఎంక్వైరీ చేసినంత ఈజీగా సైబర్ క్రైమ్స్‌ను పసిగట్టలేకపోతున్నారు. ఓటీపీలను షేర్ చేయొద్దని, లింక్‌లు ఓపెన్ చేయొద్దని, సీవీఆర్ నంబర్లు ఎవరికీ చెప్పొద్దని ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. కానీ నేరాలకు పాల్పడుతున్న వారు మాత్రం తెలివిగా సొమ్ము కాజేస్తున్నారు. కొత్తగా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ గూగుల్, ఫోన్ పే యాప్స్‌కు లింక్ అయిన క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి డబ్బులను కాజేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తిస్తున్న బాధితులు సైబర్ సెల్‌కు కంప్లైంట్ చేసే వరకే మోసగాళ్లు డబ్బులను వాడుకోవడం గానీ, మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం గానీ చేస్తున్నారు. దీంతో బాధితుల డబ్బులను హోల్డ్ చేయలేకపోతున్నారు. బ్యాంకర్లు మాత్రం ఓటీపీ నంబర్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరిగినందున డబ్బులు బాధితులే కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే అంబుడ్స్‌మన్ డిపార్ట్‌మెంట్ సాయంతో మోసపూరిత లావాదేవీలను గుర్తించడం బ్యాంకర్లకు సాధ్యం అవుతుందని, కానీ ఆర్‌బీఐ రూల్స్‌ను సాకుగా చూపి వారు తప్పించుకుంటున్నారని సైబర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!