ఆర్ఆర్బీ పరీక్షల్లో అక్రమాలు.. రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గయాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గయాలో ఓ రైలుకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో నిర్వహించిన రైల్వే పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని కోరారు.
Read Also: అవినీతి రహిత దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
Also Read
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
మరోవైపు ఇటీవల బీహార్‌లోని పలు రైల్వేస్టేషన్‌లలో ఆందోళనకారులు నిరసనలకు దిగడంతో పలు రైళ్ల రాకపోకలను అధికారులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులకు, అభ్యర్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులపై అభ్యర్థులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అంతేకాకుండా లాఠీఛార్జి కూడా చేయడంతో ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 500 మంది ఆందోళనకారులపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
Gaya, Bihar | Aspirants vandalized train over alleged irregularities in Railway exam
CBT 2 exam date was not notified; no update on Railway exam which was notified in 2019…Result is still awaited…We demand cancellation of CBT 2 exam & release of exam result: Protester pic.twitter.com/9eyW8JphYa
— ANI (@ANI) January 26, 2022
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!