కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. మరోవైపు బ్రిక్స్ కూటమిలోని…
హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్…
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై దొంగతనం కేసు నమోదైంది. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ గాడిదను దొంగతనం చేసినట్టు అందిన ఫిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. రంగనాయకుల గుట్ట దగ్గరున్న సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే గాడిదను దొంగతనం చేశాడన్న ఆరోపణలపై వెంకట్ బల్మూరిని గత రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారని…
ఈనెల 20న ఆదివారం నాడు కడప, విశాఖ జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కడప చేరుకుంటారు. పుష్పగిరిలోని విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఆ…
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ (19) విఫలమైనా… మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ (52), కీపర్ రిషబ్ పంత్ (52) రాణించారు. పంత్, వెంకటేష్ అయ్యర్ కలిసి 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోస్టన్ ఛేజ్…
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌కు అభినందనలు చెప్పాలని.. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం అద్భుతం అంటూ సోమిరెడ్డి ప్రశంసలు కురిపించారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం చేస్తూ కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం తనకు నచ్చిందని సోమిరెడ్డి తెలిపారు. అటు దేశంలో…
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15 ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అసిస్టెంట్ కోచ్ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా చేశారు. ఇటీవల ఐపీఎల్ ఆటగాళ్ల కోసం జరిగిన మెగా వేలం పాటలో ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. యాజమాన్యంతో విభేదాలు వచ్చినందుకే సైమన్ కటిచ్ జట్టును వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ‘ది ఆస్ట్రేలియన్’…
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతుందని.. మూడేళ్ల కాలంలో మూడు పైసలు కూడా తేలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు…
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా నడుస్తోంది. తాజాగా విజయపుర జిల్లాలోని ఇండి ప్రభుత్వ పీయూసీ కాలేజీకి తిలకం (సింధూరం) పెట్టుకుని వచ్చిన హిందూ విద్యార్థిని లెక్చరర్లు అడ్డుకున్నారు. తిలకం తీసేసి లోపలికి రావాలని ఆదేశించారు. దీనికి విద్యార్థి తిరస్కరించాడు. అయితే తిలకం ఉంటే కాలేజీ లోపలకు వచ్చేందుకు వీల్లేదని, ఇంటికి వెళ్లిపోవాలని లెక్చరర్లు స్పష్టం చేశారు. దీంతో భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. సింధూరం అనేది మతానికి సంబంధించినది కాదని,…
ఈనెల 24 నుంచి బయోఏషియా-2022 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆ సమావేశంలో లైఫ్ సైన్సెస్ గురించి బిల్‌గేట్స్‌తో జరిగే చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా ఎదుర్కొన్న అనుభవాలు, హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్‌గేట్స్, కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. Read…