ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయాలపై మహారాష్ట్ర సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని.. దేశంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే అని సీఎం…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించడం సరికాదని ఆర్‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. దీనికంటే అమరావతి రాజధానిగా ఉంటేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని, కేంద్ర…
ఇటీవల ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసకుల గురిచేశారని డీజీపీకి రఘరామకృష్ణంరాజు వెల్లడించారు. తనపై దాడి చేసిన…
టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మనే కెప్టెన్. గతంలో రోహిత్ టెస్టుల్లో పనికిరాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలను తట్టుకుని ఏకంగా టెస్టు జట్టుకే నాయకత్వం వహించే స్థాయికి రోహిత్ ఎదిగాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం రోహిత్ శర్మ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 సెప్టెంబర్ 1న రోహిత్ అభిమానులతో #AskRohit నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ.. ‘నన్ను…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మాఘమాసంలో ఎక్కువ జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. అయితే తమ పార్టీ నేతల అన్ని శుభకార్యాలకు హాజరుకావడం కీలక నేతలకు సాధ్యం కాని విషయం. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చాలా మంది మాఘమాసంలో జరిగే శుభకార్యాలకు హాజరు కావాలని తమ నాయకుడు లోకేష్‌ను ఆహ్వానిస్తున్నారు. అందరి పెళ్లిళ్లకు వెళ్లడం టీడీపీ నేత…
వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్‌పై సజ్జల కాన్వాయ్ వాహనాలు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. ఓ వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు…
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మీ పూరింటిని కూల్చివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీ మూకలతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న అనంతలక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ…
దక్షిణాదిలో కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది జాతర ఉంటుందో లేదో అన్న అనుమానంతో మూడు నెలల ముందు నుంచే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు రాకపోకలు సాగించారు. ఈనెల 16న జాతర ప్రారంభమయ్యే నాటికి 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది…
విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసలు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓ అభినందన పత్రాన్ని పంపించారు. ఈ లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మీడియాకు చూపించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బెల్లాన చంద్రశేఖర్ ప్రతిరోజు ఆసుపత్రులను సందర్శిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారని ఆ లేఖలో…