ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాకు ఊరట లభించనుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ దూరమయ్యాడు. అతడిని వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. ఇప్పుడు అతడు దూరం కావడంతో మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు క్రికెట్ విశ్లేషకులు ఓ సలహా ఇస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న సురేష్ రైనాను…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు..…
ఏపీలో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్‌కు సంబంధించి అధ్యయనం చేయాలంటూ ఇటీవల సీఎం కేసీఆర్ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీంతో ఈ కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ నేపథ్యంలో 1వ తరగతి నుంచి 8వ…
భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించి గురువారం ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కల్యాణం టిక్కెట్లను పలు సెక్టార్‌లలో ఆలయ అధికారులు విక్రయించనున్నారు. కల్యాణోత్సవానికి రూ.7,500, రూ.2,500, రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.150 విలువ గల టిక్కెట్లతో పాటు పట్టాభిషేకం కోసం రూ.వెయ్యి విలువ గల టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కాగా కరోనాతో గత రెండేళ్లుగా భక్తులు లేకుండానే సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో భక్తుల మధ్య అంగరంగ వైభవంగా ఏప్రిల్…
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో మార్చి 4 నుంచి ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెదర్…
టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఆఫర్‌ను ఆర్టీసీ ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఉచితంగా ప్రయాణించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. 250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి నగరానికి చేరుకున్న ప్రయాణికులు రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా వెళ్లవచ్చని…
హైదరాబాద్ కృష్ణానగర్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తరగతి గదిలో సరదాగా ఆడుకున్న ఆట ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్‌లోని సాయికృప హైస్కూలులో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్‌తో క్రికెట్ ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆటలో భాగంగా విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. నలుగురు విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్‌పై దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి.…
టీమిండియా విషయానికి వస్తే ఇటీవల జట్టులో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతడు శ్రేయాస్ అయ్యర్ మాత్రమే. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్‌గా కూడా నిలిచాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో ఆటడం ఎంత కష్టంగా ఉంటుందో అయ్యర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. పొట్టి ఫార్మాట్‌లో డాట్ బాల్స్ ఆడటం తన దృష్టిలో పెద్ద నేరమని చెప్పాడు. ఎందుకంటే…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఊరట కలిగించే వార్తను అందించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర బడ్జెట్ 2022-23లో రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్ర…
దేశంలో అత్యధిక మంది కోటీశ్వరులు ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో కోటీశ్వరుల విషయంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సర్వే చేసింది. ఈ జాబితాలో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఫార్మా, బయోటెక్ రంగాలతో పాటు ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కోటీశ్వరులు సంపదను వెనకేసుకోవడంలో దూసుకుపోతున్నారు. దాదాపు రూ.220 కోట్ల సంపద ఉన్నవాళ్లు హైదరాబాద్ నగరంలో 467 మంది ఉన్నారని నైట్ ఫ్రాంక్ సర్వే…