నాబార్డ్ వార్షిక ప్రణాళికపై బుధవారం ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ సహకరిస్తోందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాబార్డ్, బ్యాంకులు సహాయం చేశాయని సీఎం జగన్ గుర్తు చేశారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ…
విశ్వనటుడు కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఫస్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిన్నపాటి వీడియోను విడుదల చేస్తూ మూవీకి గుమ్మడికాయ కొట్టినట్టు చెప్పారు. విశేషం ఏమంటే… ఈ బుల్లి వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతున్న విజువల్ ఉంది. అనంతరం ఫహద్ ఫాజిల్ దర్శకుడు…
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే తాను చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్ మీద బేస్ చేసి తీసిన…
ఏపీలో కొత్త జిల్లాల అంశం వైసీపీ నేతల మధ్య చిచ్చుపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. తాజాగా జరిగిన ఘటన ఈ టాక్ నిజమే అనిపించేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి…
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఐఆర్‌సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ చమురు ధరలపై పడింది. ఈ ప్రభావం ఇండియా మీద కూడా పడబోతోంది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అనంతరం ఈనెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు…
నేడు రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండవ విడత చర్చలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాల అమలులో భాగంగా చేపడుతున్న సంస్కరణలు పరిశీలించేందుకు ఓడీఎఫ్ కేంద్ర బృందం కాకినాడలో పర్యటన. నేడు అమరావతిలో అమరేశ్వర స్వామి రథోత్సవం. నేడు మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి రథోత్సవం, పాల్గొనున్న నారా లోకేష్. నేడు టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వులు. యడ్లపాటి అంత్యక్రియలకు హాజరుకానున్న టీడీపీ…
పిల్లి, ఎలుక కొట్టుకుంటుంటే మన పెద్దలు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అని చెప్తుంటారు. ఇప్పుడు ఇదే మాటను మనం రష్యా, ఉక్రెయిన్ దేశాలకు అన్వయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా వార్ శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను చమురు ధరలు నిండా ముంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.200 దాటింది. మరోవైపు నిత్యావసరాల…
సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ పాటతో పల్లీల వ్యాపారి భుబన్ బద్యాకర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అయితే అతడు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్లో తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా భుబన్ బద్యాకర్ ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో బద్యాకర్ ఛాతీకి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు. కాగా కచ్చా బాదమ్…
తెలంగాణలో పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన డిస్కౌంట్ విధానానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. దీంతో తొలిరోజే 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు. అయితే తొలి రోజు లక్ష నుంచి 3 లక్షల మంది వరకు వాహనదారులు ట్రాఫిక్ ఛలాన్లు…