ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం నాడు ఏపీ సీఎం జగన్ తో కలిసి పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా అంచనాల మేరకు రాణించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 357/6 స్కోరు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (96) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. క్రీజులో…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది.…
అమరావతిలోనే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంట్ సభను శుక్రవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం విధానమని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి…
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిద్ధం కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను వాయిదా వేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు,…
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. అయితే రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు, కుటుంబాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మాత్రం సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని సీజేఐ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు కోహ్లీ మీదే పడ్డాయి. అతడు సెంచరీ చేయక 833 రోజులు దాటిపోతోంది. ఈ మ్యాచ్‌లో అయినా తమ స్టార్ ఆటగాడు సెంచరీ దాహాన్ని తీర్చుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 45 పరుగులకే అవుటయ్యాడు. ఎంబుల్‌దెనియా బౌలింగ్‌లో…
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి…
రాజధాని అమరావతి రైతుల పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న ఏపీ హైకోర్టు ధర్మాసనం. జిల్లాల విభజనపై సీఎం జగన్ కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశం.డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు, సూచనల సేకరణకు రేపటితో ముగియనున్న గడువు ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. పదాధికారుల సమావేశానికి హాజరుకానున్న జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ, పార్టీ అగ్ర నేతలు. ఏపీకి రానున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి…
మేషం :- ఉపాధ్యాయులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన అవకాశం లభిస్తుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు చికాకులు వంటివి తలెత్తుతాయి. విదేశీయానానికి కావలసిన పాస్‌పోర్టు, వీసాలు అందుకుంటారు. వృషభం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఏజెంట్లు, రిప్రజెంటేటిన్లు టార్గెట్లను పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి.…