మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్) విజృంభించడంతో 574/8 భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్‌లో పడింది. చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టును భారత్ ఫాలోఆన్ ఆడించింది. రెండో…
ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను సీపీఐ నేత రామకృష్ణ కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు పలికారు. అమరావతి రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే…
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసలంక వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 435వ వికెట్ అందుకున్నాడు. దీంతో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున కపిల్‌దేవ్ 434 వికెట్లు తీసి ఇప్పటివరకు రెండో స్థానంలో ఉండగా.. తాజాగా అశ్విన్ రెండో స్థానాన్ని ఆక్రమించడంతో కపిల్‌దేవ్ మూడోస్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో…
వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్‌ను గెలవడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డ కాషాయ అడ్డా అని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేస్తామని తెలిపారు. యూపీలో నిర్మిస్తున్న రామమందిరం నిర్మాణం తరహాలో పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నిర్మాణంతో పాతబస్తీలోని టూత్ పాలిష్ ఐకాన్‌లన్నీ కొట్టుకుపోతాయని బండి సంజయ్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి…
టీమిండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి చావుదెబ్బ తింది. వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడంతో పాటు అగ్రస్థానం సంపాదించింది.…
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి మహిళల మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి ఈ పోరు పట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కాగా మహిళల క్రికెట్‌లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు…
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఉగాది సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, గిరిజన కళారూపాలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, సంస్కృతులు దర్శనమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి తన నివాసానికి వచ్చిన విషయాన్ని మెగాస్టార్…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన జడ్డూ.. ఏకంగా 228 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా టెస్ట్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ మాత్రమే. ఈ క్రమంలో జడేజా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన రవీంద్ర జడేజా 175…
సాధారణంగా పిల్లలు వారి స్నేహితులు కొడితే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. అదే టీచర్లు కొడితే పశ్చాతాపం వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. స్కూళ్లలో పిల్లలపై టీచర్ల దెబ్బపడితే అటు తల్లిదండ్రులు ఊరుకోవడం లేదు.. ఇటు పిల్లలు కూడా మాట వినడం లేదు. కానీ ఏకంగా టీచర్లపై ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లపై ఏడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేష్ జనసేన కార్యకర్త. అతడు ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకటేష్ మరణవార్తను తూ.గో. జిల్లా జనసేన నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చలించిపోయి ఆర్థిక సాయం ప్రకటించారు. సాధారణంగా జనసేన కార్యకర్తలకు…