★ గుంటూరు: నేడు ఇప్పటం గ్రామ పరిధిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు… సభకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న జనసేన బహిరంగ సభ★ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు★ నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ.. నోటీసులు ఇచ్చి కార్మికులను ఎక్కడికక్కడ…
కొల్లాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యి 8 ఏళ్లకు పైగా అవుతుందని.. అప్పటికీ, ఇప్పటికీ పాలమూరు మారిందా అని ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారని రేవంత్‌రెడ్డి నిలదీశారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతానని కేసీఆర్ చెప్పారని.. ఆ విషయం ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు.కేసీఆర్‌కు మాదిగల వర్గీకరణ…
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 7 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానం లేకుండా పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది. సెకండియర్ విద్యార్థులంతా రేపటి నుంచి తమ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. కాగా ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం…
భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన క్షిపణి చేరనుంది. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పటివరకు 300 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను మాత్రమే చేధించగలదు. అయితే త్వరలోనే 800 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ శక్తివంతమైన క్షిపణిని గగనతలం నుంచి ప్రయోగించే విధంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన సంగతి…
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం బెలిండా క్లార్క్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి మిథాలీ రాజ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ బెలిండా ఇప్పటివరకు 23 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించింది. అయితే న్యూజిలాండ్ వేదికగా సెడన్ పార్క్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో 24 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన మిథాలీరాజ్…
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో చికెన్ ధరలు డబుల్ అయ్యాయి. నెల క్రితం రూ.140 నుంచి రూ.160 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. సాధారణంగా వేసవి వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో…
సౌదీ అరేబియాలో సాధారణంగా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చేశారని నిరూపణ అయితే గుండు చేయడం, కాళ్లు, చేతులు తీసేయడం వంటివి ఆ దేశంలో చేస్తుంటారు. ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వం నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది.…
విశాఖ వేదికగా జరిగిన బీజేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. ఏపీకి మంచి దిక్కు అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం కార్యకర్తల సమిష్టి కృషి అని కార్యకర్తలను విశ్వసించే పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో విజయం స్ఫూర్తితో ఏపీలోని బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ…
ఏపీ జీవనాడి ప్రాజెక్టుగా పిలవబడుతున్న పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం పూర్తయింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల ఈ అమరిక పనులు ప్రారంభమయ్యాయి. గత సీజన్లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు 84 సిలిండర్లను అమర్చారు.…
YCP MLA Mekapti Chandrasekar Reddy Fired on YCP Leaders. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోని తన వ్యతిరేకులపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి వైఎస్ఆర్సీపీలో కలకలం రేపారు. తన ఎమ్మెల్యే పదవి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కొంతమంది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ టికెట్ ఇవ్వడంతో తాను గెలిచానని, అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చాక తాను మంచే చేశానని…