దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల అప్పుల వివరాలను ప్రకటించింది. దేశంలో అప్పుల భారం ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్ దాటేసిందని ఆర్‌బీఐ వివరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్‌డీపీలో…
తెలంగాణలో ఏబీవీపీ ప్రాంత కార్యాలయం అద్భుతంగా నిర్మించారని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్ లోని తార్నాకలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ ఆఫీస్ స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్ ను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల స్వప్నం, నిష్టతో ఈ భవనం సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. తెలంగాణ ఏబీవీపీ కార్యకర్తల త్యాగానికి ప్రతీక ఈ భవనమని, ఒకప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే సరస్వతిని పూజిస్తాడు అనేవారు…
నేడు తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆందోళన పేరుతో కాంగ్రెస్ విధ్వంసం సృష్టించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించిందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని,…
యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదవడంతో అక్కడ కఠిన లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయడంతో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు భారత్‌తో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో సారి రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదవడ కలవరపెతుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,424 మందికి కరోనా పరీక్షలు…
తెలంగాణ పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శం, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను హైదరాబాద్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ,…
ఖమ్మం మంత్రి అజయ్ పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. ఇదే ఖమ్మం పట్టణం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వేధింపులు తట్టుకోలేక .. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. ఇక్కడ నియంత పాలన జరుగుతుందని, ఉత్తి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడని.. మంత్రి అయ్యాక… ఆ పదవికి విలువ లేదు.. హోదా తెలియదు.. హుందా కూడా తెలియదంటూ ఆమె విమర్శలు గుప్పించారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదు…
మరోసారి మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పని అయిపోయిందంటూ ఆయన మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని, కాంగ్రెస్ దివాళా తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈడీ నోటిసులు వస్తే ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని, డ్యూటీలో ఉన్న ఎస్సై కాలర్ ఎలా పట్టుకుంటారు? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇబ్బంది కలిగిస్తే మా ప్రభుత్వం చూస్తూ…
ఖమ్మం జిల్లా కేంద్రంలో భూముల విలువలు పెరగటంతో దాని కోసం దాడి ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న పుట్ట కోట గ్రామంలో 12 ఎకరాల భూమిపై రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భూమికి సంబంధించి కోర్టు పరిధిలో వివాదం కొనసాగుతుండగా దీనికి సంబంధించి హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు భూమిని కొనుగోలు చేశామని భూమి వద్దకు వచ్చారు. దీంతో స్థానికంగా ఉన్న కొంతమంది వారిమీదికి దాడికి పాల్పడ్డారు. కట్ చేస్తే…. తమ…
నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. భాగ్యనగరం కాంగ్రెస్ శ్రేణుల నిరసనగాలో అట్టుడికిపోయింది. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టిడికి యత్నించగా.. పోలీసులు వారి పథకాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ సర్కిల్ వద్ద బైక్‌కు నిప్పుపెట్టి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.…
హైదరాబాదు నగర పరిధిలోని పోలీశ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నగరంలోని 2865 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ ఉత్వర్వులు జారీ చేశారు. పోలీసు కానిస్టేబుల్స్-2006, హెడ్ కానిస్టేబుల్-640, ఏఎస్ఐలు -219 మందిని బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కోవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వీరి బదిలీలు పెండింగ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. 5 నుండి 7 సంవత్సరములు లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆన్ లైన్…