హైదరాబాదు నగర పరిధిలోని పోలీశ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నగరంలోని 2865 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ ఉత్వర్వులు జారీ చేశారు. పోలీసు కానిస్టేబుల్స్-2006, హెడ్ కానిస్టేబుల్-640, ఏఎస్ఐలు -219 మందిని బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కోవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వీరి బదిలీలు పెండింగ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. 5 నుండి 7 సంవత్సరములు లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆన్ లైన్ ద్వారా బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. బదిలీలో తెలంగాణ పోలీసులు రూపొందిచిన యాప్ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ది కీలక పాత్ర అని సీపీ ఆనంద్ వ్యాఖ్యానించారు.