ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తేదీన తుది గడువుని పేర్కొంది.
కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. భారత్ లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి.
ప్రజలు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పరిపాలన దక్షుడు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కటం అదృష్టమన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్‌లో ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, లోయలో దాని పునరుద్ధరణను నిరోధించాలని షా భద్రతా బలగాలకు సూచించారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. మార్పుల అనంతరం మార్కెట్లోకి కొత్త ఎడిషన్ విడుదల చేసింది. “బాబ్రీ మసీదు” అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అదనంగా, అయోధ్య అధ్యాయం నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించబడింది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు - ఈవీఎంల విశ్వసనీయతపై ఇటీవల పోస్టు చేశారు. ఆయన ప్రకటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, 1970 కాలం నుంచి ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్న రేటు మూడింతలు పెరిగింది.
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలని కలలు కంటారు. మీ కల నెరవేర్చుకునే రోజు ఆసన్నమైంది. ఎస్బీఐ తీపి కబురు చెప్పింది. ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది.
ఎంతైనా నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా? తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండలేడు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు.