NCERT: ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో “బాబ్రీ మసీదు” పేరు తొలగింపు..
- “బాబ్రీ మసీదు” పేరును 'మూడు గోపురాల నిర్మాణం' గా మార్పు
- నాలుగు నుంచి రెండు పేజీలకు తగ్గిన అయోధ్య అధ్యాయం
- వివరాలన్నీ సంక్షిప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. మార్పుల అనంతరం మార్కెట్లోకి కొత్త ఎడిషన్ విడుదల చేసింది. “బాబ్రీ మసీదు” అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అదనంగా, అయోధ్య అధ్యాయం నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించబడింది. “బాబ్రీ మసీదు” పదానికి బదులుగా ‘మూడు గోపురాల నిర్మాణం’ అనే పదాన్ని జోడించారు. రాముడి రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత హింస, రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాల గురించి ప్రస్తావించిన దాని కంటెంట్ నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించారు.
READ MORE: Railway Board: రైలు డ్రైవర్ల వేగ ఉల్లంఘనను సమీక్షించడానికి రైల్వే బోర్డు కమిటీ..
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
బాబ్రీ మసీదు 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించిన మసీదుగా వర్ణించారు. 1528లో రాముడి జన్మస్థలంలో హిందూ చిత్రలేఖనాలు, శిల్పాలతో నిర్మించిన నిర్మాణంగా వర్ణించబడింది. మతపరమైన ఉద్రిక్తత, అల్లర్లకు దారితీసిన మసీదును ప్రార్థన కోసం తెరవాలని 1986 ఫైజాబాద్ జిల్లా కోర్టు నిర్ణయాన్ని పాత పుస్తకం వివరించింది. కొత్త పుస్తకం ఈ సంఘటనలను క్లుప్తంగా
వివరిస్తుంది. ‘మూడు గోపురాల నిర్మాణం’ ప్రారంభోత్సవం, ఆ తర్వాత జరిగిన చట్టపరమైన, మతపరమైన వైరుధ్యాలను వివరిస్తుంది. కొత్త వెర్షన్‌లో వివాదాస్పద భూమి ఆలయానికి చెందుతుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ వివరణ అందులో పొందుపరిచారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ తొలగింపునకు సంబంధించిన వార్తాపత్రిక కటింగ్‌లను కూడా పుస్తకాల నుంచి తీసేశారు. ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావన తొలగించబడింది.
READ MORE: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..
కొత్త పుస్తకంలో బీజేపీ రథయాత్ర ప్రస్తావన తొలగించారు. “రెండవ పరిణామం 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు బాబ్రీ మసీదు సముదాయాన్ని తెరవాలని ఆదేశించింది. తద్వారా హిందువులు దేవాలయంగా పరిగణించబడే ప్రదేశంలో ప్రార్థనలు చేయవచ్చు. అయోధ్యలోని బాబ్రీ మసీదుకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. బాబ్రీ మసీదు అయోధ్యలోని 16వ శతాబ్దపు మసీదు.. దీనిని మొఘల్ చక్రవర్తి బాబర్ జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఆయన జన్మస్థలంగా భావించే రాముడి ఆలయాన్ని కూల్చివేసి దీనిని నిర్మించారని కొందరు హిందువులు నమ్ముతారు. ఈ వివాదం కోర్టు కేసు రూపంలో కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. 1940లలో కేసు కోర్టులో ఉన్నందున మసీదుకు తాళం వేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు