తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల…
పన్ను ఎగవేతకు పాల్పడిన అంశంలో దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఊరట లభించింది. కర్ణాటక ప్రభుత్వం కంపెనీకి పంపిన రూ.32,403 కోట్ల నోటీసును ఉపసంహరించుకుంది.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించామని, నగరం నిర్మాణం జరగాలంటే, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌళిక వసతులు కల్పించాలన్నారు. అందుకే శాసనసభలో బిల్లును ఆమోదించి ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్,…
అసెంబ్లీలో నాలుగున్నర గంటలు మేము నిలబడినా మాకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఎనికైన సభ్యులు మమ్మల్ని అవహేళన చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వం అని మాట్లాడుతున్నారని, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి…
సీఎం రేవంత్ రెడ్డి కావాలని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని టార్గెట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ అన్నారు. మా నియోజకవర్గాల్లో దళిత సోదరులు ఓట్లు వేస్తేనే మేము గెలిచామన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడతామని చెప్పినా స్పీకర్ మాకు అవకాశం ఇవ్వలేదన్నారు కోవా లక్ష్మీ అన్నారు. సభా వ్యవహారాల మంత్రి మమ్మల్ని కూర్చోమని అనలేదని, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కించపరిచారన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు…? అని, ఎస్సీ వర్గీకరణ…
తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో జరిగిన ఈ కేబినెట్ భేటీ దాదాపు గంటన్నరపాటు సాగింది. మంత్రివర్గంలో కీలక అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. వయనాడ్ ఘటన, రేషన్ కార్డులు, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు, ఇంటి స్థలం కేటాయింపు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై చర్చ కొనసాగింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన.. సోనియమ్మ నాయకత్వం.. అంటూ ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మహిళల పాత్ర ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోతున్నారన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయని, అసెంబ్లీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలం నాలుగున్నర గంటలు నిల్చుంటే మాకు మైక్ ఇవ్వలేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి…
గంటన్నర పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ…