కేటీఆర్ కేసీఆర్ కాపాడుకోలేక పోతున్న నాయకులను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటుందని, వాళ్ళను ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలలో బీఆర్ఎస్ సరైన పద్ధతిని పాటించలేదని, కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చినవన్నారు అద్దంకి దయాకర్. పార్టీ ఫిరాయింపుల అనేవి కేవలం తెలంగాణలోనే కాదు దేశంలోనే ఒక తంతుగా మారిందని, టీడీఎల్పీని, సీఎల్పీని మెడ్జి చేసుకున్నప్పుడు వాళ్లకు కేటీఆర్ కు,కేసీఆర్…
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై బల్దియా కొరడా ఝళిపించింది. ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్న దుకాణాలను తొలగించారు. అబిడ్స్ నుంచి బషీర్ బాగ్ వరకు ఉన్న ఫుట్‌పాత్‌పై ఉన్న బండ్లను దుకాణాలను కూల్చివేశారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న జ్యూస్ బండ్లు, చాయ్ బండ్లు మిర్చి , టిఫిన్ బండ్లను తొలగించారు. ఈ సందర్భంగా… జీహెచ్ఎంసీ అధికారులతో చిరు వ్యాపారులు వాగ్వివాదానికి దిగారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు…
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో అభివృద్ధి చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీ సోమవారం తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆనంద్ మహీంద్రాతో సమావేశమై రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. మహీంద్రా చైర్‌పర్సన్ తమ కంపెనీ పెట్టుబడి పెట్టి స్కిల్ యూనివర్సిటీకి…
ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని, కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయమని మేం సూచిస్తున్నామని, వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు గంగుల కమలాకర్. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు లేవు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయరన్నారు. చాలా జిల్లాల్లో తాగునీరు, సాగు…
గత ప్రభుత్వంలోని ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి.. ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు.