ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.
ఖమ్మం టూ సూర్యాపేట వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. సూర్యాపేట హైవే పై ఎంట్రీ వద్ద ఫ్లై ఓవర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఫ్లై ఓవర్ మంజూరుకు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించగా ఆర్ అండ్ బీ ప్రఫోజల్స్ కు ఎన్ఎచ్ఏఐ ఆమోదం తెలిపింది. దీంతో.. ఫ్లై ఓవర్ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో చర్చించి సత్వరమే పనులు…
“తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా "అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.
పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ… జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం…
మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని, ఈ అవమానం కేవలం సబితక్కకు సున్నితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ…
ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు. సునితక్క కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు అయ్యాయన్న సీఎం రేవంత్… కానీ అక్క ఆ పార్టీలోకి వెళ్లి…
వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఆమె మండిపడ్డారు. భట్టి మాటలు బాధకరమని, భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. మేం ఏ తప్పు చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ…