సీఎం రేవంత్ రెడ్డి కావాలని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని టార్గెట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ అన్నారు. మా నియోజకవర్గాల్లో దళిత సోదరులు ఓట్లు వేస్తేనే మేము గెలిచామన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడతామని చెప్పినా స్పీకర్ మాకు అవకాశం ఇవ్వలేదన్నారు కోవా లక్ష్మీ అన్నారు. సభా వ్యవహారాల మంత్రి మమ్మల్ని కూర్చోమని అనలేదని, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కించపరిచారన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు…? అని, ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి వలనే అయినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేశారన్నారు కోవా లక్ష్మీ.
MS Dhoni: ధోనీని ‘తల ఫర్ ఎ రీజన్’ అని ఎందుకు పిలుస్తారు?.. దాని వెనుక కథను చెప్పిన మహి!
అంతేకాకుండా..’నాలుగున్నర గంటలు నిలబడినా మాకు స్పీకర్.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.. మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారు.. అసెంబ్లీలో మేము.. నిలబడితే సీఎం రేవంత్ రెడ్డి నవ్వుకుంటున్నారు.. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డిని సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించారు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకపోతే సీఎం అయ్యేవారా…? ప్రజలు గెలిపిస్తేనే మేము అసెంబ్లీకి వచ్చాము.. మా తండ్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పని చేశారు.. ఇందిరాగాంధీ,సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు చెప్పుకుమి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు.. మేము మహిళలం కాదా…? సోమియాగాంధీ తెలంగాణ ఇచ్చింది.. గతంలో సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారు.. డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి.. సునీతా లక్ష్మారెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టారు.. మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాద్ధాంతం చేశారు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారు.. సభలో కేసీఆర్ లేకపోయినా కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిడుతున్నారు.. కవిత పట్ల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు..’ అని ఆమె అన్నారు.
Kalki 2898 AD: ఇంకా కల్కి చూడని వారికి గుడ్ న్యూస్