విక్రమ్ సినిమాతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక భారీ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను లోకేష్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే…
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల సంఘటనలో పోలీసులు, ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్ల ఘటనలో వైసీపీ వారు చెప్పారని అమాయకులను బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే టీడీపీ వారు చేస్తున్నారని మంత్రి విశ్వరూప్…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్‌రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో జిల్లా…
దేశంలో గృహ రుణాల లభ్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకులు వ్యక్తులకు మంజూరు చేయగలిగే గృహ రుణ పరిమితిని రెట్టింపు స్థాయికి ఆర్బీఐ సడలించింది. ఈ పరిమితిని అర్బన్ సహకార బ్యాంకులకు రూ.75 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెంచింది. అలాగే గ్రామీణ సహకార బ్యాంకుల్లోనూ రూ.75 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు. ప్రస్తుతం ఇది రూ.30 లక్షలుగానే ఉన్నది. కాగా, అర్బన్ కోఆపరేటివ్…
అక్కినేని నాగ చైతన్య, సమంత ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో అందరికి తెలిసిందే.. చైతన్య వెనుకే ఉండి ఎన్నోసార్లు ఆమె ముందుకు నడిపిందని, అతడు ప్లాపుల్లో ఉండగా దైర్యం చెప్పి వెన్నుదండుగా నిలిచిందని భర్త కోసం ‘మజిలీ’ సినిమాలో నటించి హిట్ ను అందించిందని అభిమానులు ఎంతో మురిసిపోయారు.. అయితే అలాంటి జంట ఎందుకు విడిపోయారో ఇప్పటికి అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇందులో కొంతమంది చైతన్యది తప్పు అంటే మరికొంతమంది సమంతది తప్పు అంటున్నారు. ఇక…
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటిస్తున్న రష్మిక మెగా ఆఫర్ ను వదులుకున్నదని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఒక హీరోయిన్ అనుకున్న ప్లేస్ లో మరొక హీరోయిన్ ను తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే అరెరే మంచి ఛాన్స్ వదులుకుంది అంటారు.. హిట్ అవ్వకపోతే హమ్మయ్య ఆ ఛాన్స్ వదులుకొని మంచి…
నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. అద్భుతమైన గృహిణి.. ప్రేమను పంచే తల్లి.. ఇలా ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. 1993 లో మిస్ ఇండియా మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయిన నమ్రతా.. ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత వరుస వక్షలను అందుకొని…
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక పాన్ ఇండియా మూవీగా జూన్ 3 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. దేశ చరిత్రలో అమరుడిగా నిలిచిపోయిన సందీప్…
గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు ఎట్టకేలకు భారీ విజయం దక్కింది. ‘ఖైదీ’ చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ‘మాస్టర్’ చిత్రంతో కుర్రకారును సైతం మెప్పించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాను తెరకెక్కించాడు.. ఒక హీరో అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో లోకేష్ నిరూపించాడు. జూన్ 3 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు కలెక్ట్…