విక్రమ్ సినిమాతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక భారీ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను లోకేష్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన హిట్ సినిమా ఖైదీ కి సీక్వెల్ ఉందని కన్ఫర్మ్ చేసేశాడు. కార్తీ ప్రధాన పాత్రలో లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా ఖైదీ. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే సీక్వెల్ ఉంటుందని లోకేష్ హింట్ ఇచ్చాడు. అంతేకాకుండా విక్రమ్ లో కూడా ఈ సినిమా గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో అభిమానూలు తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఒక అభిమాని ఖైదీ లో అర్జున్ దాస్ మరణించినట్లు చూపించారు.. మళ్లీ విక్రమ్ లో ఎలా బ్రతికి వచ్చాడు అని అడుగగా లోకేష్ ఖైదీ 2 గురించి క్లారిటీ ఇచ్చాడు. అందులో ఒక పోలీస్ అర్జున్ దాస్ ను దవడ మీద కొడతాడు అంతే .. అందుకే విక్రమ్ లో అతడికి కుట్లు పడినట్లు చూపించాను. ఖైదీ 2 లో అర్జున్ దాస్ ఎలా బతికాడు అన్నది చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఒక్క మాటతో ఖైదీ 2 మీద అంచనాలను పెంచేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఖైదీ 2 లో రోలెక్స్, ఢిల్లీ మధ్య యుద్ధం గట్టిగా ఉండబోతుంది అనేది మాత్రం అర్థమా అవుతుంది.