నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటిస్తున్న రష్మిక మెగా ఆఫర్ ను వదులుకున్నదని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఒక హీరోయిన్ అనుకున్న ప్లేస్ లో మరొక హీరోయిన్ ను తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే అరెరే మంచి ఛాన్స్ వదులుకుంది అంటారు.. హిట్ అవ్వకపోతే హమ్మయ్య ఆ ఛాన్స్ వదులుకొని మంచి పని చేసింది అంటారు.. తాజాగా రష్మికను మంచి పని చేసింది అంటున్నారు.. ఈ నేషనల్ క్రష్ .. మెగా హీరోలకే నో చెప్పిందంట .. చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్రకు ముందుగా రష్మికను సంప్రదించారట మేకర్స్ కానీ ఆమె కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆమె చిరంజీవి రామ్ చరణ్లకు నో చెప్పేసింది. ఆ సినిమా ఫలితాలు చూస్తుంటే ఆ సమయంలో రష్మిక నో చెప్పి మంచి పనే చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఒక్కటే కాదు అమ్మడు రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చాంతాడంత ఉంది.. ఆమె నటించిన మొదటి సినిమా కిర్రాక్ పార్టీ హిందీ వెర్షన్ లో రష్మికనే తీసుకోవాలని అనుకోగా ఆమె చేసిన పాత్రను మళ్లీ చేయలేనని చెప్పి నో చెప్పిందంట.. ఇక హిందీ జెర్సీ లో శ్రద్దా శ్రీనాథ్ పాత్రకు మొదట రష్మికనే అనుకున్నారట.. అది కూడా కొద్దిగా బోల్డ్ గా ఉండడంతో అమ్మడు కుదరదని చెప్పిందని సమాచారం.. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ లో మాళవిక పాత్రను ముందు ఈ భామ దగ్గరకే వచ్చింది. అయితే పాత్ర నిడివి తక్కువ ఉందని నో చెప్పింది.. ఇక చివరికి విజయ్ తోనే తలపతి 66 లో నటిస్తోంది. అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే రష్మిక వదులుకున్న పాత్రలు చాలానే ఉన్నాయి. ఏదిఏమైనా అమ్మడు మాత్రం మంచి పాత్రలను ఎంచుకొని ముందుకు వెళ్లడంతో అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.