రెండేళ్ల తరువాత రానా నటించిన విరాటపర్వం చిత్రానికి మోక్షం లభించింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలు రేకెత్తించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుక…
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. అందులో భాగంగా ఒక విప్లవ గీతాన్ని రిలీజ్ చేశారు. ఛలో .. ఛలో అంటూ సాగిన ఈ పాటను రానా దగ్గుబాటి పాడడం విశేషం. “దొరోని…
ఏ రంగమైనా పోటీ అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అయితే మరీ ముఖ్యంగా ఉంటుంది.. ఉండాలి కూడా.. అయితే అది ఆరోగ్యకరమైన పోటీలా ఉండాలి.. టాలీవుడ్ లో హీరోలు కానీ, హీరోయిన్లు కానీ సినిమాల పరంగా పోటీని ఎదుర్కొన్నా బయట మాత్రం కలివిడిగా ఉంటారు. అది అందరికి తెలిసిందే.. హీరోల ఫ్యాన్స్ ఏమైనా సోషల్ మీడియాలో గొడవలు చేస్తారు కానీ హీరోలు మాత్రం ఒకరి గురించి మరొకరు పల్లెత్తు మాట కూడా అనుకోరు.. ఇక హీరోయిన్ల విషయంలో…
‘ఫిదా’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఈచిత్రం తరువాత వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా భారీ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక వ్యక్తిగతంగా కూడా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులను గెలుచుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంల తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.…
బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు నుంచి ఈ జంట గురించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపికే.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని పెద్ద దుమారాన్ని రేపిన ఈ జంట పెళ్లి తరువాత ఒకరి కోసం మరొకరు పుట్టారా అన్నట్లు తమ అన్యోన్యతను చూపిస్తున్నారు. నిత్యం ఈ జంట.. కపుల్ గోల్స్ ని సెట్ చేస్తుంటే అభిమానులు వాటిని ఫాలో అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే…
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు కోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో వేసింది. అప్పటినుంచి ఈ కేసు కోర్టు విచారిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని…
సాధారణంగా ఒక స్టార్ స్టేటస్ వచ్చాకా బయట తిరగడం కుదరదు. అది ఎవ్వరైనా సరే .. అభిమానులు చుట్టూ ఉంటూ ఆటోగ్రాఫ్ లు ఫోటోగ్రాఫ్ లు అంటూ వెంటపడుతూ ఉంటారు. అందుకే సెలబ్రిటీలు ఎవరు తెలియని ప్లేస్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తారలు మాత్రం కొద్దిగా రిస్క్ చేసి అయినా తాము చేయాల్సింది చేసేస్తారు.. ప్రస్తుతం కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అదే చేసింది.. ఇటీవల హీరోయిన్ సాయి పల్లవి సినిమా…
నందమూరి బాలకృష్ణ ఇటీవలే 62 వ పుట్టినరోజు జరుపుకున్న విషయం విదితమే.. ఇక బాలయ్య పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగతో సమానం.. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అన్నదానాలు ఇలా ఒక్కటి ఏంటి .. ఆయన బర్త్ డే ను ఒక జాతరలా చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో పాటు స్టార్ హీరోలు బాలయ్యకు స్పెషల్ బర్త్ డే విషెస్ తో మారుమ్రోగించేస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం స్టార్ హీరోలు, బాలయ్య పుట్టినరోజును పట్టించుకోలేదన్న వార్త వినిపిస్తోంది.…
మాజీ బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందల్‌లు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా.. ముస్లిం దేశాలలో కూడా ఆగ్రహజ్వాలలు రగిల్చిన సంగతి తెలిసిందే. అయితే.. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన, అల్లర్లకు పాల్పడ్డారు. అయితే దీని వెనుక ప్రధాన సూత్రధారి అయిన మహమ్మద్ జావెద్ అలియాస్ జావెద్ పంప్‌కు ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ నోటీసు జారీ చేసింది. శుక్రవారం పట్టణంలో…