రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. అందులో భాగంగా ఒక విప్లవ గీతాన్ని రిలీజ్ చేశారు. ఛలో .. ఛలో అంటూ సాగిన ఈ పాటను రానా దగ్గుబాటి పాడడం విశేషం.
“దొరోని తలుపుకు తాళంలా, గడీల ముంగట కుక్కల్లా? ఎన్నాళ్లు? ఇంకెన్నాళ్లు? మన బతుకులు మారేదెన్నాళ్లు.. మారదులే .. ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే..” అంటూ సాగిన ఈ సాంగ్ ప్రతి ఒక్కరిలోనూ విప్లవాగ్నిని రగిలిస్తోంది. ఇక ఈ వీడియోలో రవన్న కవితలను చదువుతూ వెన్నెల విప్లవావేశంతో రగిలిపోతూ కనిపించింది. 1990ల సమయంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన యుద్ధం అందులో ప్రేమ కోసం ఆరాటపడే యువతి ప్రేమకథను ఎంతో హృద్యంగా చూపించనున్నారు. జీలుకర శ్రీనివాస్ రాసిన ఈ పాటను సురేశ్ బొబ్బిలి ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి జూన్ 17 న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.