నగరంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ప్రజలు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్లై ఓవర్, చెట్ల కింద తలదాచుకున్నారు. ‘రక్షాబంధన్’ సందర్భంగా మధ్యాహ్నం తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్న అనేక కుటుంబాలు వర్షంలో చిక్కుకుని మెట్రో ఫ్లైఓవర్ కింద వేచి ఉండాల్సి వచ్చింది. అరగంట తర్వాత వర్షం తగ్గిన తర్వాతే ముందుకు సాగారు. సికింద్రాబాద్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. షేక్‌పేట వద్ద సెంట్రల్ మీడియన్‌కు ఇరువైపులా వర్షం నీరు చేరడంతో…
సినిమా ఆర్టిస్టు హత్యకు గురయ్యారు. ఆర్టిస్ట్ ని చంపేసి ఆత్మహత్యగా భర్త చిత్రీకరించే ప్రయత్నం చేశారు చివరికి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ను హత్య భర్త చేసి పారిపోయాడు. పరారీలో భర్త శివరామయ్య కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన 36 సంవత్సరాల మహిళను అతని భర్త గొంతు నులిమి చంపాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీకి…
కేటీఆర్‌కి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌కి అధికారం ఉన్నా.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం అంటే తొలగిస్తాం అంటున్నాడని ఆయన మండిపడ్డారు. విదేశాల్లో చదువుకున్న వ్యక్తివి.. ఇవేం బుద్దులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఏం విగ్రహం పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం…
డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు.
అధికారులతో ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త టెక్స్‌టైల్ పాలసీపై చర్చించారు.
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని, రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ఇందుకు వారి శ్రమ,పట్టుదలే కారణమన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు అని, ఇప్పుడు హాలీవుడ్ తో పోటీ పడేలా రాణించిన బాహుబలి ప్రభాస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కఠోరమైన…
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్” (TREIRB) 2024 సంవత్సరంలో నిర్వహించిన వివిధ గురుకుల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పరీక్షలకు వేల సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో భాగంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. తర్వాత జాబితా తయారుచేసి వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగ నియామకం ప్రక్రియ చేపట్టారు. అయితే డిసెన్డింగ్ ఆర్డర్ విధానంలో(డి- ఎల్ > జె- ఎల్ > పిజిటీ > టిజిటీ)…
షెరటన్ హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం పై ఢిల్లీ లో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది. హరీష్ రావు, కేటీఆర్ నియోజక వర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. మేము…
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయన్నారు. 2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదని, పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉందని…
పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లేని యెడల నిర్మల్ జిల్లా కేంద్రంగా ఈ నెల 23న రైతులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని ఆయన వెల్లడించారు. ఈ రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, ప్రభుత్వ మేడలు వంచుతాం ఏలేటి మహేశ్వర్ అన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి డైవర్ట్ చేశారు, ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా…