ఏపీలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ ఏర్పాటుపై కసరత్తులు చేస్తుంది. ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే కొత్త పీఆర్సీ కమిటీ కోసం ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నారు సచివాలయం ఉద్యోగుల సంఘం సహా ఇతర ఉద్యోగ సంఘాలు.
నాన్ వెజ్ అంటే గుర్తుకు వచ్చేది చికెనే.. రుచిగా ఉండటంతో పాటు అందరికి అందుబాటులో ఉంటుంది.. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు లోట్టలేసుకుంటూ తింటారు.. ఇంకొందరు రకరకాల వెరైటీలను చేసుకొని మరీ తింటారు.. కొంతమంది చికెన్ లేకుండా ముద్ద కూడా ఎత్తరంటే అతిశయోక్తి కాదు. అంతలా చికెన్‌కి బానిసలుగా మారిపోతున్నారు కొందరు.. అది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఈ చికెన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అత్యంత భయంకరమైన…
బీజేపీ అగ్రనేతలు ఏపీకి రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్నారు. జూన్ 8న అమిత్ షా విశాఖకు వస్తుండగా, 10న తిరుపతికి జేపీ నడ్డా రానున్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది.