ఖమ్మం సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన సభలో దయానంద్ అనుచరుడు అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సండ్ర కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం స్థలాలు కేటాయించడంలో తాను మొదటి, చివరి వ్యక్తిని కాదని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పదివేల గజాలకు పైన, మమత సొసైటీకి ప్రభుత్వం స్థలం కేటాయించిందని ఆయన అన్నారు.
Also Read : Ap News: 12వ పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు.. పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
నాకు కేటాయించింది (క్వాటర్స్) ఇప్పటికీ అమలు కాలేదని, ఈ నెలకి కూడా బిల్ ప్రభుత్వానికి చెల్లించా అని ఆయన వ్యాఖ్యానించారు. 1994లో ఎన్టీ రామారావు తనకు నివాసగృహం కింద కేటాయించారని, అది రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నామని, సైకో మాటలకు సత్తుపల్లి ప్రజలు స్పందిస్తారా లేదా అనేది కాలం చెప్తుందన్నారు. ఇప్పటికి క్వార్టర్స్ అధికారికంగా అలాట్ కాలేదని, ఇప్పటికీ రెంట్ చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. ఎవరికి టికెట్ ఇస్తారని, ఎవరు కాంగ్రెస్, ర్యాలీకి పార్టీకి సంబంధం ఉందా అనే విషయాలు ఆ పార్టీ అంతర్గతంగా చూసుకుంటుంది మాకు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Health : వీకెండ్ కదా అని చికెన్ ను కుమ్మేస్తున్నారా?.. ఇది వింటే జన్మలో తినరు..