పీపుల్స్ మార్చ్ పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. నేడు ఆయన పాదయాత్ర అచ్చంపేట నియోజకవర్గంలో కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి పోరాడిన ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ కలను నెరవేర్చిన సోనియా గాంధీ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డిప్యూటీ స్పీకర్‌గా అసెంబ్లీలో రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టడం, ఆ బిల్లును ఢిల్లీకి పంపించడంలో నా పాత్రను పోషించానని ఆయన వ్యాఖ్యానించారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నం తప్పా, ప్రత్యేక తెలంగాణ లక్ష్యాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం, స్వాతంత్రం, భావ స్వేచ్ఛను బిఆర్ఎస్ పాలనలో పూర్తిగా కోల్పోయామని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, అమ్మ హస్తం పథకం కూడా అందరిని దుస్థితి కేసిఆర్ పాలనలో నెలకొన్నదని, దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి ఆ చట్టాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. మైనార్టీ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు.
TSRTC : వరంగల్ రీజియన్‌లో 132 ఎలక్ట్రిక్ బస్సులు
అంతేకాకుండా.. ‘ దళిత బందుకు రూ. 17,700 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి, ఏడాది పూర్తయిన నిధులు విడుదల చేయకుండా చట్టసభను అవమానించిన వ్యక్తి సీఎం కేసీఆర్. ధనిక రాష్ట్రంలో పింఛన్లు నిత్యవసర సరుకుల కోత, ఇందిరమ్మ ఇండ్ల బంద్ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. అనేక చట్టాల ద్వారా పేదలకు భూములపై హక్కులు రాగ… ధరణి తీసుకువచ్చి ఆ హక్కులను తొలగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి ధరణి ద్వారా పాల్పడుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు, ప్రగతిశీల వాదులు ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు ఏంటి? ఈ పదేండ్ల కాలంలో సాధించిన లక్ష్యాలు ఏంటి? అన్నదానిపై చర్చ జరపాలి.
AP NEWS: జనాల్లోకి జనసేనాని.. వారాహిపై ప్రచారానికి సిద్ధమైన పవన్ కల్యాణ్
సాధించుకున్న తెలంగాణలో లక్ష్యాలు నెరవేరకుండా అడ్డుగా ఉన్నది ఎవరు? ఆ అడ్డుని ఎలా తొలగించుకోవాలో ప్రజలు ఆలోచన చేయాలి. ప్రశ్నిస్తే పోలీసుల నుంచి వేధింపులు, బెదిరింపులు ఉంటాయన్న భయం నుంచి బయటపడాలి. బీఆర్ఎస్ పరిపాలనలో విధ్వంసం అవుతున్న తెలంగాణను కాపాడుకోకుంటే 70 ఏళ్ల క్రితం నాటి ఫ్యుడల్ వ్యవస్థ కింద ప్రజలు నలిగి పోవాల్సి వస్తుంది. భూములను దోపిడీ చేయడానికి క్యాప్టలిస్టులు, ఫ్యూడలిస్టులు తెలంగాణపై దాడి చేస్తుండ్రు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రజల సిద్ధమయ్యారు. అమెరికాకు వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ 100 సీట్లలో గెలుస్తుందని చెప్పడం హాస్యస్పదంగా ఉంది.’ అని భట్టి విక్రమార్క అన్నారు.