సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో నేడు టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన నిజాంను మరిపిస్తున్నదన్నారు. సెక్రటేరియట్ కూల్చివేసి జాగిర్దారుగా అందర్నీ ఇంటికి పిలిపించుకొని పరిపాలన చేస్తున్నారు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రజలదనాన్ని రైతుబంధు, దళిత బంధు పేరిట వెచ్చించి అధికార దుర్వినియోగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన అన్నారు. నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావడానికి దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు రూపాయలు కేటాయించి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నదని, ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేసిన, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, వెయ్యి మంది కేసీఆర్లు, లక్ష మంది కేటీఆర్ లు అడ్డు పడిన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Hyderabad : డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..తల్లి పరిస్థితి విషమం..
అనంతరం డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ అక్రమ వ్యాపారాలతో బీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డారని, కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ అయిందన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరక ప్రజల బతుకులు మారలేదని, ఆంధ్రప్రదేశ్ బోర్డు మారి తెలంగాణ వచ్చిందే తప్పా.. అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వలేదు కానీ, ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ మాత్రం కట్టుకుండని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటే కేసీఆర్ పాలన వల్ల ఐదు లక్షల కోట్ల అప్పులై రాష్ట్రం తాకట్టు పెట్టబడిందన్నారు.
Also Read : BJP high command for AP: ఏపీకి బీజేపీ హైకమాండ్.. రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసిన కమలం పార్టీ