Soyam Bapu Rao : మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాస్టర్లపై వ్యాఖ్యలు రాద్ధాంతం చేయొద్దని, మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం బాపురావు క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా క్రైస్తవులంటే నాకు ఎలాంటి ద్వేషం లేదని, అందరికంటే ఎక్కువగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను అయితే ఏజెన్సీ ప్రాంతాలలో అమాయక ఆదివాసీలను కొందరు పాస్టర్లు ప్రలోభ పరుచుకొని బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్నారన్నారు. ‘ఇంకో మతం వారు మా జాతి యువతులను మాయ మాటలతో లవ్ జిహాద్ ఉచ్చు లో దించుతున్నారు. దీంతో సనాతన సంస్కృతి , ఆదివాసీ ఆచారాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది ఇలాంటి అనైతిక చర్యల వాళ్ళ ఆదివాసీ జాతి మనుగడ ప్రశ్నర్ధకంగా మారడం నాకు బాధ కలిగించింది. రాంజీ గోండ్ , కొమురం భీం వారసులమైన మేము అంతరించి పోతున్న జాతి మనుగడ , అస్తిత్వం కోసం జాతిని కాపాడుకునేందుకు డెబ్భై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం.
Also Read : Kavach Technology : రైలు ప్రమాదాల నివారణకు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన కవాచ్ వ్యవస్థ ఏమైంది?
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో మతం మారిన ఆదివాసీలను ST జాబితా నుండి తొలగించి రిజర్వేషన్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేయడమే కాక తీర్మానం కూడా చేశాం. ఆదివాసీల సంస్కృతిని దెబ్బ కొట్టి బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్న ఒక ముఠా గురించే నేను మనోవేధనతో ఘాటుగా మాట్లాడి ప్రతీకార చర్యలతో బుల్లెట్ల మాదిరిగా ప్రతిఘటిస్తాం అని చెప్పడం జరిగింది. దీనిని క్రైస్తవ సోదరులు , సంఘాలు అపార్థం చేసుకోవడం శోచనీయం. బలవంతపు మత మార్పిడిలు చేస్తూ అమాయక గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్న కొందరు పాస్టర్ల తీరు గురించే నేను తీవ్రంగా స్పందించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. తప్పా క్రైస్తవ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కానే కాదు .
Also Read : Rail Accident: కోరమాండల్ రైలు ప్రమాదంలో 50దాటిన మృతుల సంఖ్య
ఏజెన్సీ ప్రాంతాలలో 5th షెడ్యూల్ ప్రకారం అన్యమత ప్రచారం రాజ్యాంగ విరుద్ధం. అయినా ఇంత కాలం మేము ఓపిక సహనం తోనే ఉన్నాం. బలవంతపు మత మార్పిడిలు ఆపివేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలం లో 1200 మంది అమాయక ఆదివాసులను బలవంతంగా మతమార్పిడి చేయడం మా దృష్టికి వచ్చింది. జాతి కోసం ఉద్యమాలు చేస్తున్న నన్ను కొందరు అనవసరంగా అకారణంగా విమర్శలు, ఆరోపణాల్తో రాద్ధాంతం చేయడం మానుకోండి. నన్ను కొందరు బెదిరించి హెచ్చరించడం అవివేకం. నా జాతి కోసం చావుకైనా సిద్ధమేనని గుర్తుంచుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాను. అన్ని మతాలు నా దృష్టిలో సమానమే . కొన్ని ముఠాల చర్యలను మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.’ అని సోయం బాపు రావు అన్నారు.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!