భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అయితే తాజాగా జిల్లాలోని మణుగూరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని గద్దె దించేందుకు ఎవరైతే ఉన్నారో వారికే మా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. దాదాపుగా అది ఖరారు అయినట్లేనని, మేము జాయిన్ అయినామంటే ఆ ప్రభుత్వం వచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు
ఏ పార్టీ అనేది ఇంకో పది రోజుల్లో చెప్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ రాక్షస పాలన ఐదు నెలలే అని, ఐదు నెలల్లో మీ సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చేది మన ప్రభుత్వమే మీ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సత్యాగ్రహ పద్ధతిలో బీటీపీఎస్ ముందు పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న వారికి వంద శాతం మద్దతు తెలుపుతున్నామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం, శ్రమకు తగిన విధంగా కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీటీపీఎస్ కాంట్రాక్టర్ కార్మికులకు అండగా మద్దతుగా ఉంటానని ఆయన తెలిపారు. అదేవిధంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రజలకు కలిగిన మేలు ఏమి లేదని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరకపోవడం విచారకరమని తెలియజేశారు.
Hyderabad : డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..తల్లి పరిస్థితి విషమం..