ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశమైంది. తొలి రోజున 18 జిల్లాల సమీక్ష జరగగా.. ఇవాళ 8 జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నెలలోనే ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) చీఫ్‌గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఒకవైపు సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సొంత బిజినెస్ లతో బాగానే సంపాదిస్తున్నారు.. మహేష్ బాబు గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. సాధారణంగా మహేష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీనే ఆయన ప్రపంచం. ప్రతి ఏడాది అనేక మార్లు కుటుంబంతో కలిసి టూర్స్ కి వెళతారు. మహేష్ ఫ్యామిలీ…
అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తు ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా.. ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబట్టింది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు…
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 29 ఉండగా ఈరోజు మళ్లీ పెరిగింది.. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 30 కి పైగా చేరింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో దాదాపు 10…
బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు తరలించారు.. అయితే బెయిల్ కోసం అప్లై చేసుకున్న ప్రశాంత్ కు మొదట నిరాశ కలిగింది.. ఇప్పుడు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. అయితే ప్రశాంత్‌కు కోర్టు షరతుల తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు…
Terrorists Attack: జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.