కొవిడ్ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో సమీక్షించారు. జేఎన్–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు.
లోకేష్‌ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ తెలిపింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని SRK అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. ఎందుకంటే మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ సంవత్సరాల్లో,…
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా సపోర్టు ఇస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు రాహుల్ ఫోన్ చేశారు.
నంద్యాలలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. గ్లాడిస్ అనే రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు పాశవికంగా హత్య చేశారు.
క్రిస్మస్, నూతన సంవత్సరానికి ముందు వ్యాపార వినియోగదారులకు గుడ్ న్యూ్స్.. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39.50 తగ్గించాయి.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా తమ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ విడుదలైంది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ సినిమా బొమ్మ థియేటర్లలో పడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా విడుదల అవుతుందన్న వారం ముందు నుంచే థియేటర్లను ముస్తాబు చేసి అందంగా తయారు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.. తాజాగా ఓ అభిమాని విధ్యుత్ షాక్ గురై ప్రాణాలను వదిలాడు.. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాల్లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే..…
శ్రీశైలం ఆలయంలో అభిషేకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు వెల్లడించారు.