మడకశిర తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్‌పై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మడకశిర తహశీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు సస్పెండ్ చేశారని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ తమ భారతీయ మీడియా కార్యకలాపాలను విలీనం చేయబోతున్నాయని ఒక నివేదిక తెలిపింది. ఈ విలీనం వల్ల షేర్లు, నగదు ద్వారా రిలయన్స్ 51 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉంటుందని, మిగిలిన 49 శాతం డిస్నీ కలిగి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఏకంగా 1.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ ధరతో పోలిస్తే.. తక్కువ ధరకు లభిస్తున్న దేశీయ బొగ్గు లభిస్తుండడంతో విదేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బొగ్గు ధరలలో వ్యత్యాసం కారణంగా కొనుగోళ్లు ఆగిపోయాయి.
సింగరేణిలో ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి జరగనున్న ఎన్నికల్లో 13 పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీల పోటీ కొనసాగుతుంది.
ప్రతి వారంలో ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు విడుదలవుతాయి.. అలాగే ఈ వారం కూడా ఓటీటిలోకి భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. గత శుక్రవారం థియేటర్లలోకి ‘సలార్’ వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది.. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. కల్యాణ్ రామ్ ‘డెవిల్’, సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న ‘బబుల్‌గమ్’ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ విడుదల కాబోతున్నాయి.. ఈ వారం ఓటీటిలోకి రాబోతున్న…
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్న సినిమా సలార్.. ప్రభాస్ హీరోగా తెరకేక్కిన ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ క్రేజ్ మరొకసారి పెరిగిపోయింది.. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్ మరొకసారి తన స్టామినా ఏంటో సలార్ సినిమాతో నిలబెట్టుకున్నారు.. ఇప్పటికి ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. బాహుబలి…
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే…
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో కూడా పుంజుకుని పూర్వవైభవం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.