పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబట్టింది..
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజే అదరగొట్టాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్స్ మాములుగా లేవు..శుక్రవారం ఒక్కరోజే మొత్తం రూ.175 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. వాటిల్లో దేశీయంగా రూ.135 కోట్లు వసూలు కావడం గమనార్హం. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సాక్‌నిల్క్ కథనం ప్రకారం దేశీయంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూ.49 కోట్లు కాగా, శుక్రవారం ఒక్కరోజే రూ.60 కోట్లు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో చిత్రీకరించారు. భారత్‌లో ఆన్‌లైన్ బుకింగ్స్ రూ.42 కోట్లు దాటాయి.
తొలి రోజే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్స్ రూ.180 కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్లు వసూలు చేస్తే భారత్ బాక్సాఫీసు వద్ద రూ.135 కోట్లు వసూలవుతాయని చెబుతున్నారు.. ఈరోజు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఇక ప్రభాస్ ఖాతాలో భారీ వసూళ్లను సాధించిన సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమాకు రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ అని టైటిల్ పేర్లు ఖరారు చేశారు. దేవా/ సలార్‌గా ప్రభాస్, వరద రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమన్నార్‌గా జగపతి బాబు, ఆద్యగా శ్రుతి హసన్ నటిస్తున్నారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడంతోపాటు పలు భాషల్లో విడుదలైంది.. షారుఖ్ ఖాన్ డుంకీ కూడా విడుదలైంది.. ఇందులో సలార్ దూసుకుపోతుందని టాక్..