జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ జాబితా సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు, రేపు సమీక్ష నిర్వహించనుంది.
పార్లమెంట్ నుంచి 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.
వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఒకప్పుడు పెళ్లిలో ఏది ఉంటే అది తినేసి వెళ్ళేవాళ్లు బంధువులు.. కానీ ఇప్పుడు ఏది తక్కువైన కూడా గొడవలకు దిగితున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.. ఇక సోషల్ మీడియాలో భయంకరంగా కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరో భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. జీవితంలో ఒక్కసారే చేసుకొనే ఈ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు.. పెళ్లికి వచ్చిన బందువులకు పది రోజులు గుర్తుండేలా…
న్ను గెలిపించిన గిరిజనులకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదా.. పర్యాటక శాఖా మంత్రి హోదాలో గిరిజనులతో డాన్స్ చేసిన రోజా దీని కోసం నోరు ఇప్పలేదే.. పుట్టినరోజు సందర్భంగా జగన్ కు బుద్ధి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.
నాపై పని గట్టుకుని విమర్శలు చేస్తున్నారు.. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే.. మన పిల్లలు దేశంలోనే అత్యత్తమంగా ఉండాలి.. గత పాలనలో స్కూళ్లు ఎలా ఎన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయి.. తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్ తో ప్రభుత్వ స్కూల్స్ తో పోటీ పడే పరిస్థితి వచ్చింది- సీఎం జగన్
సజ్జల మాట్లాడుతూ.. కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి.. మన కాళ్ళపై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదు.. దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ కే సాధ్యం అని ఆయన చెప్పారు.