Heavy Traffic : హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది. లక్డీకపూల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12, రోడ్ నెం. 1లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడ చిక్కుకుపోయాయి. ఊహించని రీతిలో వాహనాలు రద్దీ పెరిగిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఐకియా, గచ్చిబౌలి, నానాక్‌రామ్‌గూడలో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. దీంతో వేల కొద్దీ వాహనాలు రోడ్డలపైనే నిలిచిపోయాయి. కేంద్రం తీసుకువచ్చిన హిట్&రన్ నిబంధనలకు ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె చేపట్టడంతో.. పెట్రోల్ బంక్‌లకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిన్నటి నుంచి నిలిచిపోయింది.
Also Read
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
ఇంకో రెండు రోజుల పాటు ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె కొనసాగించే అవకాశం ఉందని వార్తలు రావడంతో పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనదారులు పెట్రోల్ బంక్‌లకు ముందు క్యూ కట్టారు. అయితే.. ఈ రోజు సాయంత్రం ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెను విరమించడంతో యధావిధిగా ఈ రోజు రాత్రి వరకు అన్ని పెట్రోల్ బంక్‌లకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరగనుంది. అయితే.. ఇప్పటికే బంక్‌ల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తి అయిపోవడంతో బంక్‌ల ముందు నోస్ట్కాక్ బోర్డులు పెట్టారు బంక్ యాజమానులు. అయితే.. ఊహించని రీతిలో రోడ్లపైకి వాహనాలు రావడంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. అయితే.. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలోనే కాకుండా.. జిల్లాల్లో కూడా పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌లు ముందు వాహనదారులు క్యూకట్టారు.
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?