ఇంటర్ బోర్డుకు సంబంధించిన150 కోట్లు ను ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది మొదటి సారి అని, ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుందన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల కోసం ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను 52 కోట్లు కూడా ఇంటర్ బోర్డ్ నుండి చెల్లించాలని ఆదేశించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉచిత విద్యకు ఈ పది ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 62 లక్షలు మాత్రమేనని, ప్రభుత్వం ఇంటర్ విద్య ను గాలికి వదిలేసిందన్నారు మధుసూదన్ రెడ్డి. ఇంటర్ బోర్డు ఆర్థిక పరిస్థితి దిగజారిందని, పరీక్షలో డ్యూటీ లో, స్పాట్ వల్యూవేషన్‌లో పాల్గొన్న వారికి రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.
50 వేల మందికి రెమ్యునరేషన్ పెండింగ్ లో ఉందని, 200 మందికి అదనంగా పని చేసినందుకు 80 రోజుల వేతనం ఇవ్వలేదన్నారు. మా డబ్బులు మా ముఖాన పడేయాలని ఇంటర్ బోర్డు నీ డిమాండ్ చేస్తున్నానన్నారు. వివిధ పనుల(ఇంటర్ విద్యా కమిషనరేట్ లో నిర్మాణాలు, జూనియర్ కాలేజి లో మౌలిక వసతుల) కోసం 42 కోట్ల ను నవీన్ మిట్టల్ దారి మళ్లించారని, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి అని ఆయన అన్నారు. లావా దేవిలా పై విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అధ్యాపకులకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరుతామన్నారు. ఇంటర్ బోర్డు ఆర్థిక స్థితిగతుల పై వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు.