Kunamneni Sambasiva Rao : పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ-కాంగ్రెస్ కూటమికి మధ్యే పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ కూటమికి మద్య పోరాటమన్నారు వరంగల్ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బీఆర్‌ఎస్ పార్టీ ఎవరితో ఉన్నారు.? అని ఆయన ప్రశ్నించారు. ఒకటీ రెండో చోట్ల బీఆర్‌ఎస్ గెలిస్తే ఇండియా కూటమికి సహకరిస్తారా..? బీజేపీ కి మద్దతిస్తారా..? అని ఆయన అన్నారు. ఎంఐఎం పార్టీ బీజేపీ అంతా మత ఉన్మాదం కలిగిన పార్టీలా మేం భావించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలి… ఆ పార్టీ దారి తప్పితే దానికి వైద్యం చేస్తామని, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం.. ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తామన్నారు కూనంనేని సాంబశివరావు. దేశంలో రామ జపం మోడీ జపంగా మారిందని, బీజేపీ బరితెగించి రాముణ్ణి రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. శాస్త్ర సాంప్రదాయాలను పెక్కన పెట్టి అన్నీ మోడీ అయ్యాడని, రాముడి పేరుతో ప్రజలను రెచ్చ గొట్టిఓట్లు దందుకోడం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. దేశాన్ని ఒక మతానికి పరిమితం చేయడం మంచిది కాదని, ఈ పాపపు పనులకు కచ్చితంగా నరకంలోకి పోతారన్నారు. వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి ఐదు స్థానాల్లో ఒక పార్లమెంట్ స్థానం సీపీఐకి ఇవ్వాల్సిందేనన్నారు.
కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ శాపనార్దాలు, పోకడలు ప్రజాతీర్పుకి విరుద్ధంగా ఉన్నాయని, బీఆర్‌ఎస్ నేతల తీరు పుట్టినబిడ్డ కళ్ళు కూడా తెరవక ముందే గొంతునులిమి చంపేలా ఉందన్నారు కూనంనేని సాంబశివ రావు. కంసుడి లాంటి వాళ్ళు బీఆర్‌ఎస్ నాయకులు, తాము తప్ప మరెవరూ ఉండకూడదని కుట్రలు చేస్తున్నారని, గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలనే పనిలోనే బీఆర్‌ఎస్ ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాలకు మించి బీఆర్‌ఎస్ గెలవదన్నారు. కంసుడి వధ తరహాలో వీరి పతనం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ స్నేహధర్మం ప్రకారం చేస్తే మీకు కూడా మంచిదని, తెలంగాణలో ఐదు స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నామన్నారు. కమ్యూనిస్టులతో కలువడం వల్లే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిందని, చత్తీస్ ఘడ్ లో కలుపుకుపోలేదు కాబట్టే ఓటమి చెందిందననారు. ఓటమితో బీఆర్‌ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?