అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.. అతిరధ మహరతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. ప్రతిష్ట రోజు దేశమంతా ఒక ఉత్సవంలాగా ఘనంగా జరుపుకున్నారు.. దేశమంతా పండుగ జరుపుకుంటున్న వేళ హర్యానా రాష్ట్రంలో విషాదం జరిగింది. హనుమంతుడిగా వేషధారణ చేసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.. ఆ నాటకం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
వివరాల్లోకి వెళితే.. ఈ విషాద ఘటన హర్యానాలో వెలుగు చూసింది.. హర్యానాలోని భివానీలో జరిగింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న క్రమంలో హర్యాయనాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా హరీష్ అనే వ్యక్తి హనుమంతుని పాత్రలో కనిపించారు.. తన డైలాగులు చెప్తున్న సమయంలో అతను జై శ్రీరామ్ అంటూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు..
అందరూ అతను నాటకంలో భాగంగా అలా చేస్తున్నాడేమో అనుకున్నారు. కొద్ది సేపటికి ఆయన గుండెపోటుకు గురైనట్లు గుర్తించి.. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే హరీష్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.. దాంతో పండుగ వేళ ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అతని కుటుంబ సభ్యుల భాధ వర్ణణాతీతం..