టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తుంది.. అతి చిన్న వయస్సులో భారీగా సంపాదిస్తుంది.. మహేశ్ కూతురు సితార పుట్టినప్పటి నుంచే ట్రేండింగ్ లో ఉంది.. మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈమె ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు టీనేజీలోకి వచ్చిన తర్వాత సితార మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది.. ఇక ఈ అమ్మడు సంపాదన కూడా ఓ రేంజులో ఉందనే చెప్పాలి..
గతంలో ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్‌లో కనిపించిన సితార.. ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ఓ పాటలో డ్యాన్సులతో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇన్ స్టాలో ఈమెకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.. ఇక యూట్యూబ్ లో కూడా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు.. ఈ క్రమంలోనే బ్రాండ్స్, ప్రమోషన్స్ లాంటివి చేస్తూ మంచిగా సంపాదిస్తోంది.
2023 లో ఓ జ్యూవెల్లరీ యాడ్ లో నటించిన ఈ అమ్మడుకు ఏకంగా ఒక సినిమా రెమ్యూనరేషన్ తీసుకొందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క యాడ్ కు ఏకంగా కోటి రూపాయలు తీసుకుందని తెలుస్తుంది.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సితార సంపాదన విషయమై కొన్ని నంబర్స్ వినిపిస్తున్నాయి. నెలకు ఏకంగా రూ.30 లక్షల వరకు సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..