ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK 109 సినిమాలో ఈ అమ్మడు నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో తాను పోలీస్‌గా నటిస్తున్నట్లు ఊర్వశి ధృవీకరించింది. బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి కూడా ఈ యాక్షన్-ప్యాక్డ్ వెంచర్‌లో నటిస్తున్నారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు..
ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా కావడంతో.. ఈ చిత్రాని NBK 109 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. బాలయ్య బాబు, బాబీ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందుతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించునున్నారు..