సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది..
సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.. బిగ్ బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటిని సంపాదించుకున్న సీరియల్ నటుడు హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా చేయబోతుంది.. హీరోగా ఒక కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం బుల్లితెరపై సందడి చేసిన అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా సందడి చేయబోతున్నాడు..
ఇండస్ట్రీకి రాక ముందే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సుప్రీత. తల్లీ కూతురు ఇద్దరుహాట్ హాట్ డ్రస్ లతో,ఇన్ స్టా రీల్స్ స్పెషల్ ఫోటోస్ తో బాగా పాపులర్ అయిపోయారు. ఇక ఈ సినిమాతో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు ప్రొడక్షన్ నం.2 పూజ కార్యక్రమం ఫిబ్రవరి1 న ప్రసాద్ ల్యాబ్ , హైదరాబాద్ లో జరిగింది.. M3 మీడియా బ్యానర్లో,మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాణంలో తెరకెక్కనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు.. ఈ సినిమాలో సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవింద్ర, రూప లక్ష్మీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..